MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ 7 d ago

ఐపీఎల్ లో శుక్రవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై తొలుత వరుసగా మ్యాచులు ఓడి, సొంతగడ్డపై కోల్ కతాను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో కూడా 2 మ్యాచులు ఓడి ఒకదాంట్లో గెలిచింది. చివరిగా పంజాబ్ పై ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ రోజు ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.